భారత దేశ నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్‌లో పొందుపర్చడం సరైనది కాదని నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి విమర్శించారు.
భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే సమావేశంలో లేవనెత్తాలని, ఈ చిత్రాన్ని తొలగించేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరుదేశాల మధ్య అనవసర, ప్రమాదకర దౌత్య వివాదానికి కారణమవుతుందని నేపాల్ మరో మాజీ ప్రధాని బాబూరాం భట్టరాయ్ పేర్కొన్నారు.