Thursday, June 18, 2026
HomeTrending Newsఒడిశా రైలు ప్రమాదంపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఒడిశా రైలు ప్రమాదంపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులను అడిగి ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.  సీఎం ఆదేశాలమేరకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్ఎం అధికారి నుంచి సమాచారం తెప్పిస్తున్నామని, లాగే ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలియజేశారు.

  • పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక బృందాన్ని ప్రమాదం జరిగిన బాలాసోర్‌ ప్రాంతానికి పంపించాలని
  • ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటుచేయాలని
  • రైల్వే అధికారులనుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరాతీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పనిచేయాలని
  • దీంతో పాటు ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలని
  • క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని
  • ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు.

గుడివాడతోపాటు సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌,  విశాఖలో కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆనంద్‌, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌లతో కూడిన బృందం వెళ్తోందని సిఎంఓ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular