Wednesday, June 17, 2026
Homeసినిమాతేజ్, సతీష్ మధ్య అసలు ఏం జరిగింది..?

తేజ్, సతీష్ మధ్య అసలు ఏం జరిగింది..?

సాయిధరమ్ తేజ్, మేనేజర్ సతీష్ మధ్య గొడవ జరిగిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎంతో క్లోజ్ గా ఉండే వాళ్లిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది. వీళ్లిద్దరి గొడవ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే… సాయిధరమ్ తేజ్ ఇప్పుడు సక్సెస్ లోకి వచ్చాడు. విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘బ్రో’ సినిమాతో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి టైమ్ లో తేజ్ దగ్గర మేనేజర్ గా మనవాడు ఉండాలి కానీ.. వేరే వాళ్లు కాదనే ఫీలింగ్ వచ్చిందట. అందుకనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తిని తీసుకువచ్చి బ్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అప్పగించారట తేజ్.

అది మేనేజర్ సతీష్ కి నచ్చకపోవడంతో ఇలా అయితే నేను మేనేజర్ గా ఉండనని వెళ్లిపోతానని చెప్పాడట. వెంటనే వెళ్లిపోతే వెళ్లిపో అన్నాడట. సతీష్ వెళ్లిపోతుంటే… తేజ్ గట్టిగా ఇంకెప్పుడు నాకు మొహం చూపించకు అన్నాడట. గమ్మత్తు ఏంటంటే.. మేనేజర్ గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కూడా సతీషే అని సమాచారం. ఎంతో క్లోజ్ గా ఉండే తేజ్, సతీష్ ఈవిధంగా విడిపోవడం అనేది ఎవరూ నమ్మలేకపోతున్నారు. అయితే.. తేజ్, సతీష్ మధ్య మాటామాట పెరిగినప్పుడు  తేజ్ పరుషమైన భాష వాడాడని.. సతీష్ బాగా ఫీలయ్యాడని వార్తలు వస్తున్నాయి. తేజ్ సతీష్ ను మార్చడానికి కారణం.. కొత్తగా వచ్చిన మేనేజర్ కు తేజ్ మదర్ రికమండేషన్ ఉందని.. పైగా అతను బంధువు కావడంతో తేజ్ కాదనలేకపోయాడు అంటున్నారు. అయితే… సతీష్ ను పంపించేసిన విధానమే బాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై తేజ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular