Saturday, November 23, 2024
HomeTrending NewsBalasore:ఒడిశా ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Balasore:ఒడిశా ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైల్వే చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 154, 175 కింద కటక్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలాసోర్‌ జీఆర్‌పీఎస్‌ ఎస్‌ఐ పాపుకుమార్‌ నాయక్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో 288 మంది మృతి చెందగా.. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

ఘటనతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 51 గంటల తర్వాత ఆదివారం రాత్రి 10.40 గంటలకు మొదటి రైలు ప్రారంభమైంది. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గూడ్స్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. పట్టాలు తప్పిన ట్రాక్‌పైనే విశాఖపట్నం పోర్టు నుంచి రూర్కెలా స్టీల్ ప్లాంట్‌కు బొగ్గుతో కూడిన గూడ్స్ రైలు బయలుదేరింది. ఆ తర్వాత మరో రెండు రైళ్లు సైతం ట్రాక్‌ మీదుగా వెళ్లాయి. ట్రాక్‌ పునరుద్ధరణ తర్వాత 50-60 రైళ్లు ప్రయాణించాయని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ప్రయాణికుల కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్