Thursday, June 18, 2026
Homeసినిమాబాలకృష్ణ 108వ సినిమాకి ఖాయం చేసిన టైటిల్ ఇదే.!

బాలకృష్ణ 108వ సినిమాకి ఖాయం చేసిన టైటిల్ ఇదే.!

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలిసి ‘#NBK108’ తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది. ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి.

బాలకృష్ణ అంటే మాస్ .. మాస్ ఆడియన్స్ నుంచి అత్యధిక ఆదరణ కలిగిన స్టార్. ఆయన సినిమా టైటిల్ దగ్గర నుంచి పవర్ఫుల్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అలాగే ఆయన సినిమాల్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలని ఆశపడతారు. ఇక ఫైట్స్ .. డాన్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పవలసిన పనేలేదు.ఒక్క మాటలో చెప్పుకోవాలంటే బాలకృష్ణ సినిమా అంటే దానికి కొన్ని కొలమానాలు తప్పకుండా ఉంటాయి. వాటికి తగినట్టుగానే ఆయన సినిమాలు ఉండేలా మేకర్స్ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాంటి అంశాలతోనే బాలయ్య 108వ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది.

ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను సెట్ చేయనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అదే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, బాలయ్య పోస్టర్ ను వదిలారు. నేలలో దిగబడిన ఒక బలమైన ఆయుధాన్ని పైకి లాగుతూ బాలయ్య కనిపిస్తున్నాడు.

ఒక బలమైన యాక్షన్ సీన్ కి బాలయ్య రెడీ అవుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఆయన లుక్ ఇంతకుముందు సినిమాలకంటే చాలా డిఫరెంట్ గా ఉంది.బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా, ఆయన కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular