Thursday, June 18, 2026
Homeసినిమాథియేటర్లలో రేపు చిన్న సినిమాల సందడి!

థియేటర్లలో రేపు చిన్న సినిమాల సందడి!

శుక్రవారం వస్తుందనగానే థియేటర్స్ లోకి దిగిపోయే సినిమాల వివరాలు తెలుసుకోవడానికి అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ శుక్రవారం రంగంలోకి దిగిపోయే సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దాదాపు ఒక అరడజను సినిమాలు రేపు థియేటర్లకు వస్తున్నాయి. ఒక్కో సినిమా ఒక్కో జోనర్ కి సంబంధించినది కావడంతో, అందరూ కూడా తమ సినిమా వసూళ్ల విషయంలో కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.

కొంతకాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థ్, ‘టక్కర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో రొమాన్స్ తో కూడిన యాక్షన్ ఎక్కువగానే ఉండనున్నట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఆ తరువాత ‘ఇంటింటి రామాయణం‘ కూడా రేపే విడుదలవుతోంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో నడిచే కథతో ఈ సినిమా పలకరించనుంది. నరేశ్ .. రాహుల్ రామకృష్ణ .. నవ్యస్వామి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఇక ‘విమానం’ సినిమాపై కూడా ఆసక్తి గట్టిగానే ఉంది. సముద్రఖని – అనసూయ పాత్రలు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. వీజే సన్నీ హీరోగా రూపొందిన ‘అన్ స్టాపబుల్’ కూడా గట్టి నమ్మకంతోనే రంగంలోకి దిగుతోంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలోని సినిమా కావడంతో, ఈ సినిమాపై కూడా యూత్ లుక్ ఉంది. ‘అనంత’ అనే మరో సినిమా కూడా ఈ జాబితాలో కనిపిస్తోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా కావడంతో కాస్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. చూడాలి మరి ఏ సినిమా ఎక్కువ మార్కులు కొట్టేస్తుందో.

Also Read: టక్కర్ తో టచ్ లోకి వచ్చిన బ్యూటీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular