Wednesday, June 17, 2026
HomeTrending NewsCNG: ఏడాదిలో మరో 400 సీఎన్​జీ స్టేషన్లు

CNG: ఏడాదిలో మరో 400 సీఎన్​జీ స్టేషన్లు

ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్​జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్​జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 సి.ఎన్.జి స్టేషన్లని ఏర్పాటు చేయగా తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర వద్ద 100వ సి.ఎన్.జి స్టేషన్ ప్రారంభించింది. మేఘా గ్యాస్ సీఈఓ పలిమిపాటి వెంకటేశ్ ఈ స్టేషన్​ను ప్రారంభించారు. మేఘా గ్యాస్ తన తొలి సి.ఎన్.జి స్టేషన్​ను ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా, ఆగిరిపల్లిలో ప్రారంభించి.. ప్రస్థానం మొదలు పెట్టింది. 100వ స్టేషన్​ను కీసరలో ప్రారంభించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్ర ప్రదేశ్​లో 28, కర్ణాటకలో 12, ఉత్తర ప్రదేశ్​లో 4, మధ్య ప్రదేశ్​లో 4, తమిళనాడులో 3, పంజాబ్​లో 3 సి.ఎన్.జి స్టేషన్లను మేఘా గ్యాస్ ఏర్పాటు చేసింది. రాజస్థాన్​లో కూడా సేవలను అందించనుంది.

హైదరబాద్ కేంద్రంగా నడిచే మేఘా సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ.. సహజ వాయువును సరఫరా చేస్తోంది. 2015లో ప్రారంభమైన మేఘా గ్యాస్ తన సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని బెల్గాం మరియు తుమకూరులో ప్రారంభించింది. తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు విస్తరించింది. వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 64 జిల్లాల్లో ఎలాంటి అవాంతరం లేకుండా సేవలు కొనసాగిస్తోంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల కోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్​జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్​జీ) సరఫరా చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular