కరోన కేసులతో కేరళ సతమతం అవుతోంది. మహమ్మారి కట్టడి కోసం రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31వ తేది, ఆగస్ట్ ఒకటో తేదిన లాక్ డౌన్ ఉంటుందని, రేపు అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ నుంచి అత్యవసర సర్వీసులు మినహాయించారు. ఉహించని విధంగా రెండు రోజుల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. మంగళ వారం సుమారు 23 వేల కేసులు, బుధవారం 20 వేల కేసులు కొత్తగా రావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా వచ్చిన కేసుల్లో సగం కేరళ నుంచే ఉన్నాయి.
మరోవైపు మహారాష్ట్రలో కూడా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలపై ఈ రోజు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. వారాంతాల్లో లాక్ డౌన్ విధించే అంశంపై ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.