Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్ఒలింపిక్స్: క్వార్టర్స్ కు పురుషుల హాకీ జట్టు

ఒలింపిక్స్: క్వార్టర్స్ కు పురుషుల హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా పురుషుల హాకీ జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. ఈ విజయంతో క్వార్టర్స్ కు చేరుకుంది ఇండియా. నేడు జరిగిన మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పై 3-1 తేడాతో విజయం సాధించి పూల్ ‘ఏ’లో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడిన ఇండియా మూడు విజయాలు సాధించింది. రేపు ఆతిథ్య జపాన్ జట్టుతో చివరి పూల్ మ్యాచ్ ఆడనుంది.

రెండు జట్లూ హోరా హరీ తలపడ్డాయి. మొదటి రెండు క్వార్టర్ సమయాల్లో ఎవరికీ గోల్స్ దక్కలేదు. మూడో క్వార్టర్ లో వరుణ్ కుమార్ ఇండియాకు మొదటి గోల్ అందించాడు. ఆ తర్వాత పెనాల్టీ కార్నర్ ను ఉపయోగించుకున్న అర్జెంటీనా ఆటగాడు కేసేల్లా గోల్ చేయడంతో ¬1-1తో స్కోరు సమం అయ్యింది. ఆట ముగిసే సమయంలో మనదేశం తరఫున వివేక్ సాగర్ ప్రసాద్, హర్మన్ ప్రీత్ లు చెరో గోల్ చేసి ¬3-1 తో ఇండియా విజయం సాధించంలో కీలక పాత్ర పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular