Tuesday, June 16, 2026
Homeసినిమాపంచ్ ప్రసాద్ కు సిఎం రిలీఫ్ ఫండ్ సాయం

పంచ్ ప్రసాద్ కు సిఎం రిలీఫ్ ఫండ్ సాయం

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ‘జబర్దస్త్’ ఫేం పంచ్‌ ప్రసాద్‌కు అవసరమైన వైద్య సాయం అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రసాట్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి రోజా సిఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రసాద్ వైద్య ఖర్చులు భరించాలని జగన్ ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు సిఎంవోలో ఆరోగ్య శ్రీ విభాగం పర్యవేక్షిస్తున్న డా. హరికృష్ణ వెంటనే స్పందించి తగిన లెటర్ అఫ్ కన్సెంట్ ను ప్రసాద్ చికిత్స పొందుతున్న హైదరాబాద్ యశోద ఆస్పత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కిడ్నీ సంబధిత వ్యాధితో కొన్ని సంవత్సరాలుగా ప్రసాద్ బాధపడుతున్నారు. అయన త్వరగా కోలుకోవాలని మంత్రి రోజా ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular