WTC Final: రెహానే సెంచరీ మిస్ – ఇండియా ఎదురీత

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్-2023 లో ఇండియా ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అజింక్యా రెహానే-89; శార్దూల్ ఠాకూర్ -51; రవీంద్ర జడేజా-48 మినహా మిగిలినవారు విఫలమయ్యారు. 173 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు  చేసి మొత్తంగా 296 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇండియా తొలి ఇన్నింగ్స్ లో నిన్న 29 పరుగులతో క్రీజులో ఉన్న రెహానే దూకుడుగా ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. సెంచరీ సాధిస్తాడని అందరూ అనుకున్నా 89 వద్ద కమ్మిన్స్ బౌలింగ్ లో గ్రీన్ పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 51 పరుగులతో సత్తా చాటాడు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3; స్టార్క్, బొలాండ్, గ్రీన్ తలా 2; నాథన్ లియాన్ 1 వికెట్ సాధించారు.

ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో వార్నర్-1; ఉస్మాన్ ఖవాజా-13; స్టీవెన్ స్మిత్-34; ట్రావిస్ హెడ్-18 పరుగులు చేసి  ఔట్ కాగా, లబుషేన్-41; కామెరూన్ గ్రీన్-7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా బౌలర్లలో జడేజా 2; సిరాజ్, ఉమేష్ చెరో వికెట్ సాధించారు.

భారత బౌలర్లు ఆసీస్ ను కట్టడి చేస్తేనే భారత్ కు విజయం సాధ్యమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *