కెనడాలో భారీ స్థాయిలో కార్చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. ఆ దావానలం నుంచి దట్టమైన పొగ వస్తోంది. అయితే ఆ పొగ ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాలను కమ్మేసింది. చాలా దట్టంగా వ్యాపిస్తున్న ఆ పొగ ఇప్పుడు అత్యంత దూరంలో ఉన్న నార్వేలోనూ దర్శనమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కెనడాలోని అడవుల్లో అంటుకున్న మంటల నుంచి వస్తున్న పొగ ఇప్పుడు గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్‌లోనూ కనిపిస్తోంది.
రానున్న కొన్ని రోజుల్లో కెనడా నుంచి వస్తున్న కార్చిచ్చు పొగ యూరోప్ మొత్తంగా వ్యాపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆకాశంలో జరిగే ఆ మార్పును ప్రజలు గమనించలేకపోవచ్చు అని ఇవాంజిలియో తెలిపారు. కెనడా అడవుల్లోంచి రిలీజైన పొగ చాలా ఎత్తు వరకు వెళ్తుందని, దాని వల్ల ఆ పొగ ఎక్కువ దూరం వ్యాపిస్తుందన్నారు.