Saturday, November 23, 2024
HomeTrending NewsRains: దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు...ముంబైకి అలెర్ట్

Rains: దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు…ముంబైకి అలెర్ట్

నైరుతీ రుతుప‌వ‌నాలు ఊహించ‌ని రీతిలో దూసుకెళ్తుతున్నాయి. రుతుప‌వ‌నాలు దాదాపు దేశ‌మంతటా 80 శాతం వ్యాపించిన‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ  ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వ‌ల్ల చాలా వేగంగా రుతుప‌వ‌నాలు దేశంలోని వివిధ ప్రాంతాల‌కు విస్త‌రించిన్న‌ట్లు సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ న‌రేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం రోజే ఢిల్లీ, ముంబై న‌గ‌రాల‌కు రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి. దాదాపు 62 ఏళ్ల త‌ర్వాత ఇలాంటి మార్పు జ‌రిగిన‌ట్లు డాక్ట‌ర్ కుమార్ వెల్ల‌డించారు.

నిజానికి జూన్ 11న ముంబైకి, జూన్ 27వ తేదీన ఢిల్లీకి రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తుంటాయ‌ని, కానీ రెండు మెట్రో న‌గ‌రాల‌కు ఒకే రోజున రుతుప‌వ‌నాలు చేరుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ ఏడాది కొత్త విధానంలో రుతుప‌వ‌నాలు దేశం మొత్తం విస్త‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అస్సాంలో ప్ర‌స్తుతం మేఘాలు వీడాయ‌ని, అక్క‌డ వ‌ర్ష‌పాతం ఇప్పుడు త‌క్కువ‌గా న‌మోదు కానున్నట్లు కుమార్ తెలిపారు. రుద్ర‌ప్ర‌యాగ్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌లోని ఇత‌ర ప్రాంతాల్లో దాదాపు 12 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదు కానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

మరోవైపు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పూంచ్‌ సెక్టార్‌లోని మెంధార్‌ ఏరియాలో కూడా ఇవాళ కుంభవృష్టి కురిసింది. రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముంబై (Mumbai) సహా మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో రాగల 48 గంటలపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ జారీ చేశారు.

ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరో ఘటనలో ఉత్తరకాశీ జిల్లా పురోలా తహసీల్ లోని కంద్యాల్ గ్రామంలో పొలంలో నాట్లు వేస్తుండగా అభిషేక్ (20) అనే యువకుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్