Wednesday, March 11, 2026
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: విండీస్ పై నెదర్లాండ్స్ 'సూపర్' విజయం

ICC WC Qualifiers: విండీస్ పై నెదర్లాండ్స్ ‘సూపర్’ విజయం

ఐసిసి వరల్డ్ కప్ -2023 క్వాలిఫైర్స్ మ్యాచ్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ పై నెదర్లాండ్స్ సూపర్ ఓవర్ విజయం సాధించింది. విండీస్ ఇచ్చిన 375 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు 374 పరుగులు చేయడంతో  స్కోరు సమం అయ్యింది.  దీనితో సూపర్ ఓవర్ నిర్వహించారు. దీనిలో తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టులో వాన్ బీక్ ఆరు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 పరుగులు చేయగా…  విండీస్ ఐదు బంతుల్లో 8 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో విజయం నెదర్లాండ్స్ ను వరించింది.

హరారే లోని తకషింగ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 65 బంతుల్లో  9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104;  బ్రాండన్ కింగ్ 81 బంతుల్లో  13 ఫోర్లతో 76;  జేమ్స్ చార్లెస్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 54; కెప్టెన్ హోప్ 38 బంతుల్లో  3 ఫోర్లు 2 సిక్సర్లతో 47; చివర్లో కీమో పాల్ 25 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 46 పరుగులు చేశారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ దే లీడ్, సాకిబ్ జుల్ఫిఖర్ చెరో 2;  వాన్ బీక్, కింగ్మా చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం భారీ అయినా నెదర్లాండ్స్ చక్కని పోరాట పటిమ ప్రదర్శించింది. నిడమానూరు తేజ 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 111; కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 67; విక్రమ్ జిత్ సింగ్ 37; మాక్స్ ఒదౌద్ 36; చివర్లో లోగాన్ వాన్ బీక్ 14 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 పరుగులు చేయడంతో 50 ఓవర్లు పూర్తయ్యే నాటికి 374 పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా నిలిచింది.

విండీస్ బౌలర్లలో రోస్టన్ 3; అల్జారీ జోసెఫ్, అకీల్ హోసేన్ చెరో 2; జేసన్ హోల్డర్ ఒక వికెట్ పడగొట్టారు.

సూపర్ ఓవర్ లో 6 బంతుల్లో 30 పరుగులు సాధించిన లోగాన్ వాన్ బీక్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular