Saturday, November 23, 2024
HomeTrending NewsHeavy Rains: భారీ వర్షాలు.. నిలిచిన చార్‌ధామ్ యాత్ర

Heavy Rains: భారీ వర్షాలు.. నిలిచిన చార్‌ధామ్ యాత్ర

నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాలు, వరదల కారణంగా 300కు పైగా రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. చండీఘడ్ – మనాలి రహదారి దెబ్బతిన్నది. దీంతో మండి జిల్లాలో వాహనాలు నిలిచిపోయి పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ‘కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న 350 సున్నిత ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది’అని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ఆరు మరణాలు సంభవించాయి.

నిలిచిన చార్‌ధామ్ యాత్ర..

మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది. ‘వేర్వేరు ప్రాంతాల్లో హిమపాతం, వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ అనుమతించిన తర్వాత పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుతున్నాం’ అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మీడియాకు వెల్లడించారు. అలాగే ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి, చమోలీ, పితోరాగఢ్‌, రుద్రప్రయాగ, బాగేశ్వర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది..

RELATED ARTICLES

Most Popular

న్యూస్