Wednesday, June 17, 2026
Homeసినిమాఅల్లరి నరేష్ '#N62' అనౌన్స్ మెంట్

అల్లరి నరేష్ ‘#N62’ అనౌన్స్ మెంట్

అల్లరి నరేష్ వెరైటీ సబ్జెక్ట్‌ లను ఎంచుకుంటున్నారు. ఈరోజు ఆయన 62వ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘#N62’ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా, హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా యూనిక్ స్టైల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా చేసిన అనౌన్స్ మెంట్ ఆసక్తికరంగా ఉంది.

దర్శకుడు, అల్లరి నరేష్‌కి ఫోన్ చేసి కథ చెప్పడానికి మాస్ బార్‌ ను సెలెక్ట్ చేసుకుంటాడు. లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా అంశాలతో కూడిన కథ నరేష్‌ని మెప్పించిన తర్వాత.. సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. ఈ కథ చాలా యూనిక్ గా వుంటుంది. ఇందులో నరేష్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా,ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.సెప్టెంబర్ చివరి నుంచి షూట్‌ ను ప్రారంభిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular