Tuesday, June 16, 2026
Homeసినిమానా కెరీర్ ని మరో మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ‘స్పై’ - నిఖిల్

నా కెరీర్ ని మరో మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ‘స్పై’ – నిఖిల్

నిఖిల్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై . గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజశేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయిక గా నటించింది. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, నిఖిల్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. 11.7 కోట్లతో నేషన్‌ వైడ్ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ… ‘స్పై’ సినిమాకి వరల్డ్ వైడ్ యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా కెరీర్ ని మరో మెట్టు పై కి ఎక్కిస్తూ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుముందు మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను.

దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శకుడు గ్యారీ సినిమాని చాలా  కొత్తగా రిచ్ గా ప్రజెంట్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులంతా మంచి సినిమా అందించామని అభినందిస్తున్నారు. ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీచరణ్ నేపధ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. స్పై చాలా రిచ్  ఫిల్మ్. ఫన్, ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి అన్నీ వున్నాయి. ఈ వీకెండ్ కి మంచి సినిమా చుశామనే అనుభూతి ఇస్తుంది. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular