Saturday, November 23, 2024
HomeTrending NewsBus Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 26 మంది సజీవ దహనం

Bus Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 26 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని బుల్దానాలో బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 26 మంది సజీవ దహనం, 8 మంది గాయపడ్డారు, పూణెకు వెళ్తున్న బస్సులో సుమారు 33 మంది ఉన్నారని, సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాతృలను దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నాగ్‌పూర్‌ నుంచి పుణె వెళ్తుండగా.. ఒక్కసారిగా టైరు పేలడంతో అదుపు తప్పిందని బుల్దానా ఎస్పీ సునీల్‌ కడసానే చెప్పారు. పక్కనే ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిందని వెల్లడించారు. దీంతో బస్సులో మంటలు చెలరేగాయని, ఏం జరిగిందో తెలుసుకునే లోపే 26 మంది చనిపోయారన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నారన్నారు. బస్సు డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడిట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. టైరు పగిలిపోవడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టిందని చెప్పారు. బస్సు డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. “దేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడమే ఈ సమయంలో ప్రాధాన్యత” అని కడసానే అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్