టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. శ్రీమతి సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ పలువురిని ఇంటర్వ్యూ చేసి అగార్కర్ నియామకానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.
అగార్కర్ ఇండియా తరఫున 26టెస్టులు, 191 వన్డేలు , 4టి 20 మ్యాచ్ లు ఆడారు. వన్డేల్లో వేగంగా…. 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా అగార్కర్ రికార్డు నెలకొల్పగా ఇప్పటికీ ఈ అవార్డు అతని పేరిటే ఉంది. కేవలం 23 మ్యాచ్ ల్లోనే 50 వికెట్లు తీసిన బౌలర్ గా కూడా అగార్కర్ రికార్డు సృష్టించాడు. రంజీ ముంబై జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా పని చేసిన అగార్కర్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫార్సుల మేరకు అజిత్ అగార్కర్ ను సీనియర్ పురుషుల జట్టు సెలక్షన్ కమిటీ చైర్ పర్సన్ గా నియమిస్తున్నట్లు బిసిసిఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.
సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లను నియమించారు.