Thursday, September 19, 2024
Homeస్పోర్ట్స్Canada Open: తొలి రౌండ్ దాటిన సింధు, సేన్

Canada Open: తొలి రౌండ్ దాటిన సింధు, సేన్

కాల్గెరీలో జరుగుతోన్న కెనడా ఓపెన్-2023లో భారత షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ లు తొలి రౌండ్ లో తమ ప్రత్యర్ధులపై విజయం సాధించారు.

మహిళల సింగిల్స్ లో  సింధు 21-16, 21-9 తేడాతో కెనడా క్రీడాకారిణి తాలియా పై  గెలుపొందింది.

పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-18; 21-15 తో థాయ్ లాండ్ ప్లేయర్ కున్లావట్ పై విజయం సాధించాడు.

నిన్న జరిగిన పోటీలో పురుషుల డబుల్స్ లో గరగ కృష్ణ ప్రసాద్- పంజాల విష్ణు వర్ధన్ గౌడ్ జోడీ తొలి రౌండ్ లో గెలుపొందిన సంగతి తెలిసిందే.

కాగా, సాయి ప్రణీత్, గద్దె  రుత్విక శివానీ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్