Friday, September 20, 2024
HomeTrending NewsBJP: ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి - ప్రధాని మోడీ విమర్శ

BJP: ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి – ప్రధాని మోడీ విమర్శ

సీఎం కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. మొదటిసారి కేసీఆర్ పేరు తీస్తూ ఎదురుదాడికి దిగిన ప్రధాని మోడీ…కేసీఆర్‌ సర్కార్‌ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అవినీతి అరోపణలు లేకుండా ఏ ప్రాజెక్టు లేదు.  ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో నేడు 6,100కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ తెలుగులోనే తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

భారత్ మాతా కీ జై అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టి సభలో భద్రకాళీ అమ్మావారిని తలుచుకున్నారు. భద్రకాళి మహత్యం, సమ్మక్క, సారలమ్మల పౌరుషం, రాణి రుద్రమ పరాక్రమం అంటూ మోడీ తెలంగాణా ప్రాశస్త్యాన్ని, చరిత్రను కొనియాడారు. చారిత్రక వరంగల్ కు తాను రావటం సంతోషంగా ఉందన్నరు.

తెలంగాణలో 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‌కు బీజేపీ తన ట్రైలర్ చూపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వరంగల్ సభకు వచ్చిన ప్రజలను చూస్తే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే ధీమా కలుగుతోందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇన్నేళ్లలో కేవలం నాలుగు పనులను మాత్రమే చేస్తోందని ప్రధాని మోడీ సెటైర్ వేశారు.

అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ లకు అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు దేశ ప్రధాని మోడీ.దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందని… నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌తో తెలంగాణకు ఎంతో ప్రయోజనం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ వరంగల్‌ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగానే కాజీపేటలో వ్యాగన్‌ తయారీ యూనిట్‌ అన్నారు ప్రధాని మోడీ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్