భారత- బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి టి 20లో ఇండియా ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 115 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా మహిళల్లో…. శోర్నా అక్తర్-28; సోభన మోస్త్రీ-23; సతి రాణి-22 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్, మిన్ను మని, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ సాధించారు.
ఇండియా స్కోరు బోర్డు బోణీ కాకముందే ఓపెనర్ షఫాలీ వర్మ (డకౌట్) వికెట్ కోల్పోయింది. జెమైమా రోడ్రిగ్యూస్ (11) కూడా త్వరగా ఔటయ్యింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్- స్మృతి మందానా లు మూడో వికెట్ కు 70 పరుగులు జోడించారు. స్మృతి 38 రన్స్ చేసి స్టంప్ ఔట్ కాగా… కెప్టెన్ హర్మన్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతున్ 2; మరుఫా అక్తర్ ఒక వికెట్ పడగొట్టారు.
హర్మన్ ప్రీత్ కౌర్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఈ సిరీస్ లో భాగంగా మూడు టి 20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఇరు జట్ల మధ్య జరగనున్నాయి.