శ్రీలంక ఐసిసి వరల్డ్ కప్ క్రికెట్ -2023 క్వాలిఫైర్స్ విజేతగా నిలిచింది, ఫైనల్లో నెదర్లాండ్స్ పై 128 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 233 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కాగా లంక బౌలర్లు చెలరేగి డచ్ బ్యాటింగ్ లైనప్ ను 105 పరుగులకే కుప్ప కూల్చారు. మొత్తం ఆరుగురు బ్యాట్స్ మెన్ ఎల్బీగా వెనుదిరిగడం విశేషం
లంక బ్యాటింగ్ లో… సహన్ అర్చింగే-57; కుశాల్ మెండీస్-43; అసలంక-36; వానిందు హసరంగ-29; పాథుమ్ నిశాంక-23 పరుగులతో రాణించారు. డచ్ బౌలర్లలో వాన్ బీక్, రియాన్ క్లీన్, విక్రమ్ జీత్ సింగ్, షకీబ్ జుల్ఫిఖర్ తలా రెండు; అయాన్ దత్ ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్యం స్వల్పమే అయినా డచ్ జట్టు లంక బౌలర్ల దెబ్బకు హడలేత్తింది. ఓపెనర్లు విక్రమ్ జీత్ సింగ్ -13; మాక్స్ ఒదౌద్-33; లోగాన్ వాన్ బీక్-20 మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. 23.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ 4; దిల్షాన్ మధుశంక 3; వానిందు హసరంగ 2 వికెట్లు పడగొట్టారు.
దిల్షాన్ మధుశంక కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్, సీన్ విలియమ్స్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించింది.