లాటిన్ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో అడవుల నరికివేత, కాలుష్య కారక పరిశ్రమలతో పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. ఆయా దేశాల్లో చికెన్‌గున్యా, డెంగ్యూలతో పాటు వివిధ రకాల వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను కొత్త సమస్య కలవరపెడుతోంది.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల ప్రజల్ని చిన్న దోమ భయపెడుతున్నది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆయా రాష్ట్రాల్లో మలేరియా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో మలేరియా వ్యాప్తి పెద్ద ఎత్తున ఉండటంతో ప్రభుత్వ అధికారులు ఆరోగ్య హెచ్చరికలు జారీచేశారు.