Tuesday, June 16, 2026
Homeస్పోర్ట్స్Canada Open: పురుషుల సింగిల్స్ విజేత లక్ష్య సేన్

Canada Open: పురుషుల సింగిల్స్ విజేత లక్ష్య సేన్

కెనడా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను భారత షట్లర్ లక్ష్య సేన్ గెల్చుకున్నాడు. భారత కాలమానం ప్రకారం నేటి ఝామున 2.45 గంటల ప్రాంతంలో జరిగిన ఫైనల్లో చైనా ప్లేయర్ లీ షి ఫెంగ్ పై 21-18; 22-20  తేడాతో రెండు వరుస సెట్లు గెల్చుకొని టైటిల్ సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి సెట్ కోల్పోయిన ఫెంగ్ రెండో సెట్ లో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చాడు, ఒకానొక దశలో మూడో సెట్ తప్పదన్న అనుమానం కలిగినా సేన్ తేరుకొని మంచి షాట్లతో ప్రత్యర్థి పై విజయం దక్కించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular