Wednesday, June 17, 2026
Homeసినిమాచిరు, మల్లిడి వశిష్ట్ మూవీ స్టోరీ ఇదే..?

చిరు, మల్లిడి వశిష్ట్ మూవీ స్టోరీ ఇదే..?

చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మెహర్ రమేష్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు నటించే సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీ, మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ రెండు చిత్రాల్ని ప్రకటించనున్నారని తెలిసింది.

అయితే.. చిరంజీవితో మల్లిడి వశిష్ట్ తెరకెక్కించే చిత్రం సోషియో ఫాంటసీ కథతో ఉంటుందని.. ఇది జగదేకవీరుడు – అతిలోకసుందరి తరహాలో ఉండే కథతో సాగుతుందట. ఈ కథనే సింపుల్ గా రివర్స్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కథ ఏంటంటే.. జగదేవకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దేవలోకం నుంచి ఇంద్రజ ఓ ఉంగరం కోసం దిగి వస్తుంది. భూమి మీదకు వచ్చి హీరోతో ప్రేమలో పడుతుంది. వెనక్కి వెళ్లలేనంత బంధనాల వేసుకుంటుంది. సరిగ్గా ఇదే కథని రివర్స్ చేశారట. భూమి మీద హీరోతో ప్రేమలో ఉన్న హీరోయిన్ మాయం అవుతుందట.

దాంతో ఆమె కోసం లోకాలు అన్నీ గాలించడం మొదలుపెడతాడట. చివరికి ఆమె ఎక్కడుంది..? ఎలా కనిపెట్టాడు..? చివరకు ఏమైంది..? అనేదే కథ అని తెలిసింది. ఇందులో 8 మంది హీరోయిన్లు ఉంటారట. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న ఈ కథ ఇది. ఈ చిత్రాన్ని కూడా ఆగష్టులో అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కళ్యాణ్‌ కృష్ణతో చేసే సినిమాను సంక్రాంతికి, మల్లిడి వశిష్ట్ తో చేసే సినిమాను సమ్మర్ కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular