Thursday, May 30, 2024
Homeసినిమామేం పడ్డ కష్టానికి ప్రతిఫలం రుద్రంగి విజయం - అజయ్ సామ్రాట్

మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం రుద్రంగి విజయం – అజయ్ సామ్రాట్

జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రుద్రంగి సినిమా జులై 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మాత‌గా అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమల రామన్, గానవి లక్ష్మణ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో జరిగింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అజ‌య్ సామ్రాట్ మాట్లాడుతూ.. జులై 7న రుద్రంగి సినిమా రిలీజైంది. అన్నీచోట్ల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఏడాదిన్న‌ర పాటు మేం క‌ష్ట‌ప‌డ్డాం. ఇప్పుడు సినిమాకు చాలా మంచి ఆద‌ర‌ణ వ‌స్తుండ‌టం మాకెంతో ఆనందాన్ని క‌లిగిస్తోంది. మేం పడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినట్టుగా ఫీలవుతున్నాం. ఈ సినిమాని మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్