Saturday, November 23, 2024
HomeTrending NewsThreads: థ్రెడ్స్‌ సంచలనాలు...వారంలోనే 10 కోట్ల ఖాతాలు

Threads: థ్రెడ్స్‌ సంచలనాలు…వారంలోనే 10 కోట్ల ఖాతాలు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్‌బుక్‌ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్‌’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన‌ వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల మందికి పైగా యూజర్లు థ్రెడ్స్‌ యాప్‌లో ఖాతాలు తెరవడం విశేషం. ఈ విష‌యాన్ని మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు.

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్‌బుక్‌ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్‌’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన‌ వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల మందికి పైగా థ్రెడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొన్నట్టు మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యాప్‌ త్వ‌ర‌లోనే ట్విట్టర్‌ను అధిగమించడం ఖాయ‌మ‌ని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ట్విట్టర్‌ను ఎలాన్‌మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత, రోజుకో కొత్త కండిషన్‌ తెస్తుండటంతో చికాకులో ఉన్న యూజర్లు.. ఇప్పుడు థ్రెడ్స్‌కు బ్రహ్మరథం పడుతున్నట్టు సమాచారం. ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా వచ్చిన థ్రెడ్స్‌ను మెటా తెలివిగా ఇన్‌స్టాగ్రామ్‌తో లింకు పెట్టింది. ఇన్‌స్టా కూడా మెటాకు చెందిన కంపెనీయే అన్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 200 కోట్లమంది యూజర్లు ఉన్నారు. వీరంతా థ్రెడ్స్‌ను వాడటం మొదలుపెడితే కొన్నిరోజుల్లోనే ట్విట్టర్‌ను థ్రెడ్స్‌ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసమే ఇన్‌స్టాతో లింకు పెట్టినట్టు భావిస్తున్నారు. థ్రెడ్స్‌ యూజర్‌ ప్రొఫైల్‌ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో భాగంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో రాసే సందేశాలను ఇన్‌స్టాలోకి పంపుకోవచ్చు. సమస్యల్లా మనకు నచ్చకపోతే థ్రెడ్స్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేస్తే మాత్రం.. ఇన్‌స్టా అకౌంట్‌ కూడా దానంతట అదే డిలీట్‌ అయిపోతుంది. దీంతో ఒక్కసారి థ్రెడ్స్‌లో లాగిన్‌ అయిన యూజర్‌ ఇన్‌స్టా కోసమైనా సచ్చినట్టు దీనిని కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

థ్రెడ్స్‌ను వాడుతున్న యూజర్లలో చాలామంది ఇది కూడా ట్విట్టర్‌లాగే ఉన్నదని చెప్తున్నారు. సందేశాలు రాయటం, వీడియోలు పోస్ట్‌ చేయటం వంటివి ట్విట్టర్‌ను తలపిస్తున్నాయని చెప్తున్నారు. ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌కు 280 అక్షరాల పరిమితే ఉండగా, థ్రెడ్స్‌లో 500 అక్షరాల వరకు ఒక థ్రెడ్‌ను రాసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో 5 నిమిషాల నిడివికి మించకుండా వీడియోలను కూడా పోస్ట్‌ చేసుకోవచ్చు. అయితే, మొదటిరోజు వీడియోలు పోస్ట్‌ చేయటంలో సమస్యలు ఎదుర్కొన్నట్టు కొందరు యూజర్లు తెలిపారు. ఇక ఇందులో రాసే సందేశాలను థ్రెడ్స్‌ అని పిలుస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్