Wednesday, June 17, 2026
Homeసినిమాడిఫరెంట్ ప్రమోషన్స్ లో.. బేబి

డిఫరెంట్ ప్రమోషన్స్ లో.. బేబి

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం ‘బేబీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్ నిర్మించాడు.ఈ చిత్రానికి సాయి రాజేష్ డైరెక్టర్. ఇప్పటికే బేబి సినిమాలోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. జూలై 14న రాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో యూనిట్ అంతా బిజీగా ఉంది.

నిర్మాత ఎస్‌కేఎన్, ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్‌లు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే.. ఆనంద్ దేవరకొండ ఇందులో ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. దీంతో బేబి సినిమా ప్రమోషన్స్ కోసం వందల ఆటోలు కలిసి ముందుకు వచ్చాయి. వందల ఆటోలు ఏకమై సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించాయి. జూలై 14న బేబి సినిమా విడుదల కాబోతోందంటూ వరుస క్రమంలో ఆటోలను పెట్టి వినూత్నంగా ప్రమోషన్స్ చేయించారు మేకర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular