Tuesday, June 16, 2026
Homeసినిమాకేబీఆర్‌ పార్క్‌లో దారుణం.. మహిళా సినీ నిర్మాతకు లైంగిక వేధింపులు..

కేబీఆర్‌ పార్క్‌లో దారుణం.. మహిళా సినీ నిర్మాతకు లైంగిక వేధింపులు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పోకిరిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్ చేసేందుకు నగర వాసులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వస్తుంటారు. అయితే ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు వికృత చేష్టాలు చేస్తూ వాకర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో మహిళల మెడలోనుంచి చైన్ స్నాచింగ్ చేసి భయాందోళనకు గురి చేశారు. పార్కు చుట్టూ సెక్యూరిటీతోపాటు పోలీసులు ఉన్నా ఏ మాత్రం భయం లేకుండా పోకిరిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్ చేసేందుకు వెళ్లాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు.

కెబిఆర్ పార్క్‌లో జాగింగ్ చేస్తున్న సినీ మహిళా నిర్మాతపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికంగా వేధించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహిళా సినీ నిర్మాత ఉదయం జాగింగ్ చేసేందుకు కేబిఆర్ పార్క్‌కు ఉదయం వచ్చింది.

జాగింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి ఆమె వీడియోలు తీయడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించాడు. బ్లాక్ కలర్ వెర్నా కారులో నిందితుడు వచ్చినట్లు తెలిసింది. ఎలాగోలా నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు ఐపిసి 354ఏ, 354డి, 509కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular