Tuesday, June 16, 2026
Homeసినిమాచిరు వెర్సెస్ రజినీ. గెలిచేది ఎవరు..?

చిరు వెర్సెస్ రజినీ. గెలిచేది ఎవరు..?

చిరంజీవి, రజినీకాంత్.. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ లెజెండ్స్. అలాగే ఇద్దరూ కెరీర్ లో శిఖరం వరకు చేరిన వాళ్లే. అలాంటి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడితే.. పోటీపడితే ఏంటి.. పోటీపడుతున్నారు. ఒక రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీకి సై అంటున్నారు. దీంతో ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారు..? అనేది ఆసక్తిగా మారింది. రజినీకాంత్ ‘జైలర్’ మూవీ ఆగష్టు 10న విడుదల అవుతుంటే.. చిరంజీవి భోళా శంకర్ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది.

ఒక రోజు గ్యాప్ లో ఇద్దరూ ఇలా పోటీపడడం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో ఆసక్తిగా మారింది. అయితే.. ఈ ఇద్దరిలో చిరంజీవికే ఎక్కు విజయావకాశాలు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. రజినీ కాంత్ పేరుకు కోలీవుడ్ స్టార్ హీరో అయినా.. టాలీవుడ్‌లోనూ.. ఈయనకు మంచి ఫ్యాన్ బేస్‌ ఉంది. విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. అందుకే.. ఈయన ప్రతి సినిమా.. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్‌లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాదు.

ఎందుకంటే.. ఈమధ్య కాలంలో రజినీ సినిమాలు అంతగా ఆడడం లేదు. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా సరిగ్గా ఆడడం లేదు. అలాంటిది టాలీవుడ్‌లో ఇంకెలా ఆకట్టుకుంటారు. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. తమిళ్ లో కూడా చిరు సినిమాలు బాగానే ఆడతున్నాయి. పైగా భోళా శంకర్ టీజర్ అండ్ సాంగ్స్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే.. రజినీకాంత్ కంటే.. చిరంజీవికే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. మరి.. బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular