Friday, September 20, 2024
HomeTrending NewsZanzibar: ఐఐటీ-మద్రాస్‌ అంతర్జాతీయ క్యాంపస్‌

Zanzibar: ఐఐటీ-మద్రాస్‌ అంతర్జాతీయ క్యాంపస్‌

ఐఐటీ-మద్రాస్‌ మరో ఘనతను సాధించింది. అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించిన తొలి ఐఐటీగా రికార్డు సృష్టించింది. ఐఐటీ-మద్రాస్‌కు అనుబంధంగా టాంజానియాలోని జన్‌జిబార్‌లో అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐఐటీ-మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామకోటి గురువారం వెల్లడించారు.

జన్‌జిబార్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ప్రీతి అఘలయం నియమితులైనట్టు తెలిపారు. ఆఫ్రికా విద్యార్థులు మద్రాస్‌ క్యాంపస్‌లో విద్యనభ్యసిస్తున్నారని, జన్‌జిబార్‌ క్యాంపస్‌ వల్ల ఆఫ్రికా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్