Tuesday, June 16, 2026
HomeTrending NewsVande Bharat: వందేభారత్ రైలులో మంటలు

Vande Bharat: వందేభారత్ రైలులో మంటలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్ నుంచి ఢిల్లీ బ‌య‌ల్దేరిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ రోజు (సోమ‌వారం) ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కుర్వాయి కేథోరా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఉద‌యం 8 గంట‌ల‌కు వందే భార‌త్‌లోని ఓ కోచ్‌లో మంట‌లు చెల‌రేగాయి. వెంటనే రైలును నిలిపివేయటంతో.. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు రైలు నుంచి కింద‌కు దిగారు.

కోచ్‌లోని బ్యాట‌రీ బాక్సులో మంట‌లు చెల‌రేగిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంట‌ల‌ను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఇత‌ర కోచ్‌ల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌లేదు. దీంతో రైల్వే పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంట‌లు చెల‌రేగిన స‌మ‌యంలో కోచ్‌లో 22 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular