Saturday, November 23, 2024
Homeసినిమాతేజ్ 'బ్రో'.. నమ్మకం నిజమయ్యేనా.?

తేజ్ ‘బ్రో’.. నమ్మకం నిజమయ్యేనా.?

‘బ్రో’.. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ ఇది. పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటించడంతో ఈ సినిమా పై కామన్ ఆడియన్స్ లో కూడా ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. ఇలా ఎక్కువుగా రీమేక్ సినిమాలే చేస్తుండడంతో ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం లేదు. అసలు పవన్ రీ ఎంట్రీకి పవర్ ఫుల్ స్టోరీతో మాస్ కమర్షియల్ మూవీ చేస్తారనుకుంటే.. వకీల్ సాబ్ చేయడం చేసారేంటి అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమా ఫరవాలేదు అనిపించింది.

భీమ్లా నాయక్ విషయంలో కూడా అదే జరిగింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఈ రెండు చిత్రాలతో పోలిస్తే.. బ్రో మూవీకి మరింతగా నెగిటివిటీ కనిపిస్తోంది. కారణం ఏంటంటే.. బ్రో రీమేక్ మూవీ కావడంతో చాలా మంది బ్రో మాతృక వినోదయ సీతం చూసేశారు. దీని వలన కథ ఏంటి అనేది తెలిసిపోయింది. ఇంకా చెప్పాలటే.. ఇది మంచి సినిమానే అయినప్పటికీ అదొక ప్రవచనంలా ఉంటుంది. అందుకనే అనుకుంట బ్రో మూవీ పై ఆశించినంతగా బజ్ క్రియేట్ అవ్వడం లేదు. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి సాయిధరమ్ తేజ్ రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తున్నారు.

ఒరిజినల్ మూవీ చూసి బ్రో సినిమా మీద అంనాకు రావొద్దని.. బేసిక్ ఐడియా మాత్రమే తీసుకుని దీనికి పూర్తి భిన్నమైన ట్రీట్మెంట్ ఇచ్చామని తేజ్ చెప్పాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పరలు చేర్పులు చేశామని.. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గట్టుగా మార్చామని.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని సినిమాలో మాదిరి ఎంటర్ టైనింగ్ గా ఉండి చివరిలో బలమైన ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. అంతే కాకుండా.. త్రివిక్రమ్ మార్క్, సముద్రఖని మార్క్.. తనకు మావయ్యతో ఉన్న అనుబంధం ఇవన్నీ హైలెట్ గా నిలుస్తాయన్నారు. ఖచ్చితంగా బ్రో మూవీ అందరికీ నచ్చుతుందని చెప్పారు. మరి.. బ్రో మూవీ విషయంలో తేజ్ నమ్మకం నిజమౌతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్