Sunday, May 19, 2024
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' కోసం రంగంలోకి రానా

‘ప్రాజెక్ట్ కే’ కోసం రంగంలోకి రానా

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో దిశా పటానీ నటిస్తుంది. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు తెర పై రాని కథతో ఈ సినిమా రూపొందుతుందని.. ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ అని నాగ్ అశ్విన్ ప్రకటించినప్పటి నుంచి అందరిలో అసలు ఈ సినిమా కథ ఏంటి..? ప్రాజెక్ట్ కే అంటే ఏంటి..? అనేది క్యూరియాసిటీ పెరిగింది.

కాగా ప్రాజెక్ట్ కే సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టీమ్ అంతా పాల్గొననుంది. ఈ ఈవెంట్ కు హాజరు కానున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కే రికార్డు సృష్టించింది. ఈ ఈవెంట్ జులై  20వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అమెరికా చేరుకుంది. ఇప్పటికే ప్రభాస్ అమెరికాలోనే ఉన్నారు. ఆయన ఆదిపురుష్ రిలీజ్ కి ముందే అమెరికా వెళ్లారు.

ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా వస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం ఆయన అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాతే ప్రభాస్ మళ్లీ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం రానా కూడా అక్కడికి వెళ్లడం విశేషం. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని తాజాగా వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసి అమెరికాలో ల్యాండ్ అయ్యారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ప్రభాస్ హాలీవుడ్ స్టార్ లా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయితే.. రానా వెళ్లడానికి కారణం ఏంటి..? ఇందులో రానా గెస్ట్ రోల్ ఏదైనా చేశారా..? లేక వేరే కారణం ఏదైనా ఉందా..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్