Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Korea Open: ప్రణయ్, రాజావత్ విజయం - సింధు, శ్రీకాంత్ ఓటమి

Korea Open: ప్రణయ్, రాజావత్ విజయం – సింధు, శ్రీకాంత్ ఓటమి

కొరియా ఓపెన్ లో ఇండియాకు రెండోరోజూ ఆశించిన విజయాలు దక్కలేదు. హెచ్ ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రాజావత్…  డబుల్స్ లో రోహన్ కపూర్, సిక్కీ రెడ్డి జోడీ మాత్రమే విజయం సాధించారు. పివి సింధు, మాళవిక బన్సోద్, ఆశ్మిత చిల్లర, తసీమ్ మీర్, ….  కిడాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్,  కిరణ్ జార్జ్, తాన్య హేమంత్ లు తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ 21-13;21-17 తో బెల్జియం ప్లేయర్ జూలియన్ కర్రాగ్గి పై గెలుపొందాడు. మరో మ్యాచ్ లో ప్రియాన్షు రాజావత్ 21-15;21-19 తో కొరియా ఆటగాడు చోయ్ జి హూన్ పై విజయం సాధించాడు.

మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్- సిక్కీ రెడ్డి జోడీ 21-17;21-17తో ఫిలిప్పైన్స్ జంట అల్విండ్ మొరాదా-అలీసా ఎస్బెల్ పై గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular