Monday, March 16, 2026
Homeసినిమాఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ

విశ్వక్ సేన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్నిచేస్తున్నాడు. నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. చిత్ర ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. త్వరలో తదుపరి షెడ్యూల్‌ను యూనిట్ ప్రారంభించనుంది.

మరికొద్ది రోజుల్లో ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో కూడా త్వరలో రివీల్ కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular