Sunday, May 19, 2024
Homeసినిమావిమర్శలకు చెక్ పెట్టిన 'ప్రాజెక్ట్ కే' టీజర్

విమర్శలకు చెక్ పెట్టిన ‘ప్రాజెక్ట్ కే’ టీజర్

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్నిఅత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ లుక్స్ అఫిషియల్ లుక్సా..? ఫ్యాన్ మేడ్ లుక్స్ లా ఉన్నాయేంటి అనే విమర్శలు వచ్చాయి. దీంతో టీజర్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి కల్కి 2898 ఏడీ టైటిల్‌ను ఖరారు చేశారు. శాన్‌డియాగో కామిక్ కాన్‌లో చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ఇక టీజర్ విషయానికి వస్తే.. ప్రపంచాన్ని చీకటి చుట్టుముటినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది అంటూ మొదలై.. వాటీజ్ ప్రాజెక్ట్ కే అనే డైలాగ్ తో ముగిసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ప్రభాస్ లుక్స్ అభిమానులతో కేక పెట్టిస్తున్నాయి. దుష్టశక్తుల చేతిలో సామాన్యుల అవస్థలు, వారిని రక్షించేందుకు ఉద్భవించిన శక్తిగా ప్రభాస్‌తో ఫస్ట్ గ్లింప్స్ విడులైంది.

సినిమాలో రాబోయే భారీ ఫైట్ సన్నివేశం తాలూకు చిన్న భాగాన్ని కూడా ఫస్ట్ గ్లింప్స్‌లో చూపించారు. దీపికా పడుకునే ఇంట్రో కూడా ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. ఇందులో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ.. ఈ గ్లింప్స్ లో కమల్ కనిపించలేదు. అద్భుతమైన యాక్షన్, సైంటిఫక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఫస్ట్ లుక్స్ పై వచ్చిన విమర్శలకు ఈ గ్లింప్స్ చెక్ పెట్టిందని చెప్పచ్చు. అయితే.. ఈ గ్లింప్స్ లో 2024 రిలీజ్ అన్నారు కానీ.. ఎప్పుడు రిలీజ్ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో ఉంచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్