Saturday, November 23, 2024
HomeTrending NewsBlack Sea: నల్ల సముద్రంలో రాకపోకలపై రష్యా ఆంక్షలు

Black Sea: నల్ల సముద్రంలో రాకపోకలపై రష్యా ఆంక్షలు

ఉక్రెయిన్ ను కట్టడి చేసేందుకు రష్యా సరికొత్త ప్రణాలికలు సిద్దం చేసింది. అమెరికా, యూరోప్ దేశాలకు గుణపాటం చెప్పాలంటే ముందుగా ఉక్రెయిన్ ను దారిలోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవులకు ప్రయాణించే నౌకలు సైనిక లక్ష్యాలుగా పరిగణించబడతాయని రష్యా హెచ్చరించింది. సైనిక లక్ష్యాలుగా మారితే వాటిని పేల్చేసే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ ఓడరేవుల నుంచి ఆహార సరుకులను అనుమతించే ఒప్పందం నుంచి మాస్కో ఉపసంహరించుకున్న తర్వాత ధాన్యం ఎగుమతులను కొనసాగించడానికి తాత్కాలిక షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నౌక ప్రయాణాలపై రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ప్రయాణించే అన్ని నౌకలు సైనిక సరుకులను తీసుకువెళ్లే అవకాశం ఉందని “అటువంటి నౌకల దేశాలు ఉక్రెనియన్ సంఘర్షణలో పార్టీలుగా పరిగణించబడతాయి” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అర్ధరాత్రి నుంచి నల్ల సముద్రంలో నౌకల పట్ల తన కొత్త వైఖరిని అమలు చేస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌కు వెళ్లే నౌకలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. నల్ల సముద్రం అంతర్జాతీయ జలాల్లోని ఆగ్నేయ, వాయువ్య భాగాలను నావిగేషన్ కోసం తాత్కాలికంగా సురక్షితం కాదని రష్యా ప్రకటించింది. పొరుగున ఉన్న నల్ల సముద్ర దేశాల్లో ఒకటైన రొమేనియా మీదుగా తాత్కాలిక షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా తాజా ప్రకటనతో ఉక్రెనియన్ పోర్ట్ సిటీ ఒడెసా వైపు వచ్చేందుకు విదేశీ నౌకలు జంకుతున్నాయి. రష్యా నిర్ణయంతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతుందా… పశ్చిమ దేశాలు చర్చలకు దిగి వస్తాయా వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్