Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IND Vs. WI: నెమ్మదిగా ఆడుతున్న విండీస్

IND Vs. WI: నెమ్మదిగా ఆడుతున్న విండీస్

ఇండియా – వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్ లో జరుగుతోన్న రెండో టెస్టులో మూడోరోజు వర్షం ఆటంకం కలిగించింది.  నేడు 67 ఓవర్ల ఆట సాగింది.  ఒక వికెట్ కోల్పోయి 86 పరుగుల వద్ద నేటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ ఆటముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ బరాత్ వైట్ 75 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు. మెకెంజీ-32; బ్లాక్ వుడ్ -20; జాషువా సిల్వా-10 రన్స్ చేసి ఔట్ అయ్యారు. అలిక్ అత్నాంజే (37); జేసన్ హోల్డర్(11) క్రీజూలో ఉన్నారు.

బరాత్ వైట్, బ్లాక్ వుడ్, అత్నాంజే లు నెమ్మదిగా ఆడుతూ ఇండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. జడేజా 2; సిరాజ్ అశ్విన్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ సాధించారు.

విండీస్ ఇంకా 209 పరుగులు వెనకబడి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్