Saturday, March 1, 2025
HomeTrending NewsNigeria: నైజీరియాలో పడవ ప్రమాదం...103 మంది మృతి

Nigeria: నైజీరియాలో పడవ ప్రమాదం…103 మంది మృతి

ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

క్వారా రాష్ట్ర రాజధాని ఇలోరిన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటేగి జిల్లాలో వివాహానికి హాజరైన ఓ పెళ్లి బృందం తిరుగు పయణమైంది. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిపై వస్తుండగా.. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందిని సురక్షితంగా రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 300 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్