Friday, September 20, 2024
HomeTrending NewsCalifornia: కాలిఫోర్నియాలో కూలిన జెట్‌

California: కాలిఫోర్నియాలో కూలిన జెట్‌

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ జెట్‌ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణం పాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెంచ్ వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని రివర్‌సైడ్‌ కౌంటీ షెరీఫ్‌ అధికారులు తెలిపారు. ఆ విమానం లాస్‌ వెగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిందన్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు, ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టిందన్నారు. ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్