Monday, May 20, 2024
HomeTrending Newsఇది మూడు కాళ్ళ కుర్చీ: టిడిపి-బిజెపి-జనసేన పొత్తుపై విజయసాయి

ఇది మూడు కాళ్ళ కుర్చీ: టిడిపి-బిజెపి-జనసేన పొత్తుపై విజయసాయి

బిజెపి-తెలుగుదేశం-జనసేన కూటమిని మూడు కాళ్ళ కుర్చీగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఈ కుర్చీ త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై ఓ పోస్ట్ చేశారు.

2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయని…  కానీ ఆ సమయంలో వారు ఉమ్మడిగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎన్నో అబద్ధాలు చెప్పి నాడు అధికారంలోకి వచ్చారని, తరువాత హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు ఏమి ఉంటుందని ప్రశ్నించారు.

ఈ మూడు పార్టీల పొత్తు కొత్త ప్యాకేజింగ్ తో వచ్చిన పాత వస్తువులాంటిదన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించే వైఎస్సార్సీపీకే ఓటు వేయాలని విజయసాయి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్