హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనాకు చెందిన చేపల వేట నౌక బోల్తా పడింది. ఈ నౌకలో ఉన్న 39 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. నౌకలో ఉన్న 39 మందిలో చైనీయులు 17 మంది, ఇండోనేషియన్లు 17 మంది, ఫిలిప్పీన్స్ ఐదుగురు ఉన్నారని..నౌక బోల్తాపడడంతో వీరంతా గల్లంతైనట్లు చైనా ప్రభుత్వ వార్తా ఛానెల్ సిజిటిఎన్ నివేదిక తెలిపింది. ఇప్పటివరకు గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదని, వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
ఇంకా వీరి ఆచూకీ దొరకలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. బాధితుల జాడ కోసం సాయం చేయాలని పొరుగుదేశాలను చైనా అభ్యర్థించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవులు, ఫిలిప్పీన్స్, ఇతర దేశాలకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.