Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవెరైటీ ప్రమాణాలు

వెరైటీ ప్రమాణాలు

Marriages- Conditions: పెళ్ళికి ముందు ప్రమాణాలు ఉంటాయా? పెళ్ళినాటి ప్రమాణాలు అయితే కొంతవరకు తెలుస్తుంది. అయితే ప్రేమికులుగా ఉంటూ పెళ్లాడాలని కలలు కనే జంట ఒకరికొకరు చేసుకునే బాసలగురించి ఓ సినీకవి గారు

‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని!

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని

చేతిలో చెయ్యేసి చెప్పు బావ

పాడుకున్న పాటలు పాతబడి పోవని

చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని



పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని
దుడుకుగ ఉరికిన పరువానికి
 ఉడుకు తగ్గిపోదని

చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కల కాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి
మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి
ఇంక ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలై పోవాలి
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ

చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని’


వర్ణించారు.

ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి కాబోయే వధూవరుల ఆలోచనలు. అయితే పెళ్ళికి ముందు జీవితానికి తర్వాతి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. పెళ్లికి ముందు అందంగా కనిపించిన అమ్మాయి అతి మాములుగా అనిపిస్తుంది (అంతకు ముందు మేకప్ లోనే చూసి ఉండటం వలన). అమ్మాయి వంటలు అస్సలు బాగోవు( మరి ఇద్దరూ కలిసింది రెస్టారెంట్ల లోనే). ఇక ఎప్పుడూ టిప్ టాప్ గా కనిపించే అబ్బాయి ఇంటిదగ్గర ఏ పనీ చేయడని, అన్నీ తను చేస్తే తిరుగుతాడని అర్థమయ్యాక అమ్మాయికీ తత్త్వం బోధ పడుతుంది. గొడవలు కొట్లాటలు మామూలే. ఇవన్నీ మనకొద్దు అనుకున్న ఒక జంటవినూత్నంగా ఆలోచించింది. తమ ప్రమాణాలకు అర్థం ఉండాలనుకున్న ఈ జంట వాటినిప్రమాణ పత్రం రూపంలో అక్షర బద్ధం చేసి, సంతకాలు చేసింది. అయితే ఈ ప్రమాణపత్రం వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో ఊహించనంత ప్రచారం లభించింది. అందుకు కారణం వారు చేసుకున్న ప్రమాణాలు. ఇంతకీ అందులో ఏముందంటారా?

• నెలలో ఒకసారే పిజ్జా తినాలి ( శాంతికి పిజ్జాలంటే ప్రాణం మరి)
• వారానికోసారి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి
• అమ్మాయి రోజూ చీర కట్టుకోవాలి(అబ్బాయికి ఇష్టమట)
• అమ్మాయిని 15 రోజులకోసారి షాపింగ్ కి తీసుకెళ్లాలి
• అమ్మాయితో మాత్రమే పార్టీల కెళ్ళాలి
• అమ్మాయి రోజూ జిమ్ కి వెళ్ళాలి


…ఇలా సరదాగా సాగిపోయిందా ప్రమాణపత్రం. జరిగిందంతా నిజమే గానీ ఇదంతా వారి స్నేహితుల ప్లాన్. అయిదేళ్ల వీరి ప్రేమను చూస్తున్న స్నేహితులు వారిద్దరి అభిరుచులు దృష్టిలో పెట్టుకుని రూపొందించారీ పత్రం. దానిపైన శాంతి, మింటూల సంతకాలు చేయించి బహుకరించారు. ఇది ప్రేమికుల ఐడియా అనుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పెళ్లి హడావుడితో కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలిసింది కొత్త జంటకి. అపురూపమైన ఈ బహుమానాన్ని ఫ్రేమ్ చేసి భద్రపరుస్తామంటున్నారు. సరదాగా స్నేహితులు చేసిన పని అంత సీరియస్ గా తీసుకోవద్దని కూడా నెటిజన్లకు సలహా ఇస్తున్నారు.
⁃ కె. శోభ

Also Read :

శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!

RELATED ARTICLES

Most Popular

న్యూస్