Wednesday, May 7, 2025
HomeTrending Newsస్విమ్మింగ్‌పూల్‌లో డిఎస్పీ రాసలీలలు

స్విమ్మింగ్‌పూల్‌లో డిఎస్పీ రాసలీలలు

జైపూర్‌ లో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్‌ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ హీరాలాల్ సైని ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగోర్ జిల్లాకు చెందిన పోలీస్ అధికారి, మహిళా కానిస్టేబుల్‌ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె కుమారుడు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గేరే ఉండటం పోలీసు శాఖను కుదిపేసింది. వీరిద్దరికి ఏప్పటి నుంచో సన్నిహితత్వం ఉందని మహిళా కానిస్టేబుల్‌ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఒక పోలీస్‌ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్‌లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్