Saturday, January 18, 2025
Homeసినిమాసాయిదుర్గతేజ్ సినిమా కోసం భారీ సెట్!

సాయిదుర్గతేజ్ సినిమా కోసం భారీ సెట్!

సాయిదుర్గతేజ్ .. ఆ మధ్య చేసిన ‘విరూపాక్ష’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కొంత గ్యాప్ తరువాత ఆయన చేసిన ఆ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత సోలో హీరోగా ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఇంతవరకూ ఆయన 17 సినిమాలు చేయగా, ఆ జాబితాలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ .. ‘సుప్రీమ్’ .. ‘చిత్ర లహరి’ .. ‘విరూపాక్ష’ వంటి హిట్స్ ఉన్నాయి. తాజాగా ఆయన తన 18వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు.

నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసింది. రెండో షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో 12 ఎకరాలలో ఒక భారీ సెట్ ను వేస్తున్నారని సమాచారం. ఇందుకోసం పెద్దమొత్తంలో బడ్జెట్  కేటాయించినట్టు టాక్. ఈ సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ సెట్లో జరుగుతుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో సాయిదుర్గతేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. తమిళ .. మలయాళ భాషల్లో ఐశ్వర్య లక్ష్మికి మంచి ఇమేజ్ ఉంది. సత్యదేవ్ హీరోగా చేసిన ‘గాడ్సే’ సినిమాతో 2022లో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత హీరోయిన్ గా ఇక్కడ ఆమె చేస్తున్న సినిమా ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా, సాయిదుర్గ తేజ్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని అంటున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్