Friday, November 22, 2024
HomeTrending NewsUS Judge: భార్యను చంపిన జడ్జి... ఇంట్లో 47 తుపాకులు

US Judge: భార్యను చంపిన జడ్జి… ఇంట్లో 47 తుపాకులు

అమెరికాలో తుపాకి సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్ళు సామాన్యులు, సైకోలె కాల్పులకు తెగపడుతున్నారు. తుపాకి సంస్కృతిని నిలువరించేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఈ దుష్ట సంస్కృతిని కట్టడి చేయాల్సిన ఓ న్యాయమూర్తి త‌న భార్య‌ను పిస్తోలుతో కాల్చి చంపాడు. త‌న కాలుకు ఉన్న గ‌న్‌ను తీసి భార్య‌ను కాల్చాడు. కాలిఫోర్నియాలో ద‌ర్యాప్తు కోసం వెళ్లిన‌ పోలీసులు అత‌ని ఇంట్లో 47 గ‌న్స్‌, 26 వేల బుల్లెట్ల‌ను గుర్తించారు. ఆ ఆయుధాల‌న్నీ అక్ర‌మంగా క‌లిగి ఉన్న‌ట్లు తేలింది. ఈ నెల మూడో తేదిన జరిగిన ఘటనలో భార్య‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిన‌ట్లు నిర్ధారించారు. ఈ కేసులో 72 ఏళ్ల జ‌డ్జి జెఫ్రీ ఫెర్గూసన్‌ను అరెస్టు చేశారు. ఆరెంజ్ కౌంటీ కోర్టులో ఆయ‌న విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే అరెస్టు చేసిన స‌మ‌యంలో ఆ జ‌డ్జి బాగా తాగిన మ‌త్తులో ఉన్న‌ట్లు తేలింది.

రెస్టారెంట్‌లో డిన్న‌ర్‌కు వెళ్లిన దంప‌తుల మ‌ధ్య వాగ్వాదం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఆ స‌మ‌యంలో గ‌న్‌తో పేలుస్తాన‌ని భార్య‌ను త‌న‌ చేయితో సంకేతం చేస్తూ బెదిరించాడు. ఇంటికి వెళ్లిన త‌ర్వాత కూడా ఆ ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు ముదిరాయి. అయితే వేలితో బెదిరించ‌డం కాదు, నిజంగా కాల్చాల‌న్న‌ట్లు భార్య రెచ్చ‌గొట్టింది. దీంతో ఆ జ‌డ్జి త‌న కాలికి ఉన్న గ‌న్‌ను తీసి షూట్ చేశాడు. ఆ కాల్పుల్లో 65 ఏళ్ల షెర్లీ చ‌నిపోయింది.

2015 నుంచి కోర్టులో జ‌డ్జిగా చేస్తున్న ఫెర్గూస‌న్.. త‌న భార్య‌ను మ‌ర్డ‌ర్ చేయ‌లేద‌ని కోర్టుకు తెలిపారు. ఎటువంటి ఉద్దేశం లేద‌ని, ప్ర‌మాద‌వ‌శాత్తూ షూటింగ్ జ‌రిగింద‌ని, ఇది క్రైం కాద‌ని కోర్టుకు చెప్పిన‌ట్లు లాయ‌ర్ పౌల్ మేయ‌ర్ వెల్ల‌డించారు. అయితే మిలియ‌న్ డాల‌ర్ల బాండ్‌పై జ‌డ్జి ఫెర్గూస‌న్‌కు బెయిల్ మంజూరీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్