Friday, September 20, 2024
HomeTrending NewsTension in Nuh: హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

Tension in Nuh: హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నుహ్‌ అల్లర్లతో హర్యానా అట్టుడుకుతోంది. తాజాగా ఆ అల్లర్లు గురుగ్రామ్‌ను తాకాయి. గత రాత్రి గురుగ్రామ్‌లో కొందరు వ్యక్తులు బాద్షాపూర్‌ ఏరియాలో అల్లర్లకు పాల్పడ్డారు. పలు షాపులు, రెస్టారెంట్లు తగలబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురుగ్రామ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు నుహ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సెక్యురిటీని కట్టుదిట్టం చేసిన పోలీసులు.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను కొనసాగిస్తున్నారు. నుహ్‌కు సమీపంలోని ఫరీదాబాద్, పల్వాల్‌ జిల్లాల్లోనూ భద్రత పెంచారు.

హ‌ర్యానాలోని నుహ్ జిల్లాలో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల వ‌ల్ల గురుగ్రామ్ ప్రాంతంలో ఇవాళ మ‌సీదుల‌ను బంద్ చేశారు. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు ఇంటి వ‌ద్దే చేసుకోవాల‌ని ముస్లింల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. నుహ్ అల్ల‌ర్ల‌లో ఇద్ద‌రు హోంగార్డుల‌తో స‌హా ఆరుగురు మృతిచెందారు. దాంట్లో ఓ ముస్లిం మ‌త‌పెద్ద కూడా ఉన్నారు.

మరోవైపు హర్యానా ఆందోళనలు ఢిల్లీకి పాకుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ సభ్యులపై దాడులను ఖండిస్తూ ఢిల్లీలో VHP నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

సోమ‌వారం నుహ్‌లో విశ్వ హిందూ ప‌రిష‌త్ నిర్వ‌హించిన ర్యాలీలో హింస రాళ్ల‌తో ఓ గుంపు ఆ ర్యాలీపై అటాక్ చేసింది. దీంతో సుమారు 2500 మంది ఓ ఆల‌యంలో ఆశ్ర‌యం తీసుకున్నారు. వంద‌ల సంఖ్య‌లో వాహ‌నాల‌ను ద‌గ్ధం చేశారు. ఈ అల్లర్లలో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఘర్షణల్లో 6 మంది మృతి చెందగా.. అందులో నలుగురు పౌరులు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. నుహ్‌ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 41 FIRలు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్