Monday, June 15, 2026
HomeTrending NewsYadadri: చిల్లర రాజకీయాలు మానుకోవాలి - మంత్రి ఎర్రబెల్లి

Yadadri: చిల్లర రాజకీయాలు మానుకోవాలి – మంత్రి ఎర్రబెల్లి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేపు సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కెసిఆర్ ఆ భవనం నుండి మంచి పాలన అందించాలని దేవుడిని కోరుకున్నాను అన్నారు. అలాగే సీఎం కెసిఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను అని మంత్రి తెలిపారు.

ప్రతిపక్షాలు చీటికి మాటికి దేవాలయాల పేర్లు చెప్పి, సందర్శించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారని అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు సరైన సమయంలో మంచి గుణపాఠం చెబుతారు అని అన్నారు. కాగా, సీఎం కెసిఆర్ స్ఫూర్తితో తాను తన పాలకుర్తి నియోజకవర్గం లోని పలు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లుగా చెప్పారు. అంతకు ముందు మంత్రికి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు మంత్రికి, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular